ఆరు పదుల వయస్సులోను కుర్ర హీరోలకు పోటి ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో చిరు గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన చిరు.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక 2019లో సైరా నర్సింహారెడ్డితో ఆకట్టుకున్న చిరు.. ఆ తర్వాత ఆచార్య మొదలు పెట్టారు. కరోనా వలన వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే ఆచార్య ఇంకా విడుదల కాకుండానే గాడ్‌ఫాదర్, భోళా శంకర్ చిత్రాల్ని పట్టాలెక్కించాడు చిరు. బాబి సినిమా కూడా రీసెంట్గా సెట్స్ పైకి వెళ్లింది. మారుతితో చిరు ఓ సినిమా చేయబోతున్నాడు. వెంకీ కుడుముల కథకీ.. చిరు ఓకే చెప్పాడని, అనిల్ రావిపూడితో కూడా చిరు ఓ సినిమా చేయబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈ రోజు చిరంజీవి 156వ ప్రాజెక్ట్‌గా వెంకీ కుడుముల సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాని నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు టాక్. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను చిరు ప్రారంభించే అవకాశం ఉంటుంది. అందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నాడని తెలుస్తోంది.