Chinna Movie | కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్, మలయాళ స్టార్ నటి నిమిషా సజయన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా చిన్నా (Chinna). ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సేతుపతి (Sethupathy) సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీని తెలుగులో అక్టోబర్ 06న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ రేపు విడుదల కానుండగా.. మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ షో ప్లాన్ చేశారు. ఈరోజు రాత్రి హైదరాబాద్లోని ఏషియన్ మహేష్ బాబు (AMB), ఏషియన్ అల్లు అర్జున్(AAA), పీవీఆర్ నెక్సస్ మాల్లో (PVR Nexus Mal) చిన్నా ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
#Chinna paid premieres today at AMB Cinemas, AAA Cinemas & PVR Nexus Mall in Hyderabad ❤️🔥
Catch the ‘BEST FILM OF THE YEAR’ in theatres before everyone else 🤩
Book your tickets now!
– https://t.co/77o1rJmf40 pic.twitter.com/EgcCJkFse9— Vamsi Kaka (@vamsikaka) October 5, 2023
బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే చిత్రంగా ఈ సినిమా ఉంది.. సడన్గా తన కూతురు కిడ్నాప్ అవ్వగా.. కూతురు కోసం సిద్ధార్థ్ చేసే పోరాటమే ఈ సినిమా అని అర్థమవుతుంది. ఇక ఈ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మరోవైపు చిత్తా (Chithha) పేరుతో.. ఈ మూవీని తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28న విడుదల చేయగా.. పాజిటివ్ టాక్తో దూసుకెళుతుంది.