సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram) పరిస్థితులు, ఫిర్యాదులను బట్టి కొన్ని సార్లు ఖాతాలను నిలివేస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఇన్‌స్టా ఖాతా కూడా సస్పెండ్ చేసింది మేనేజ్మెంట్. అయితే ప్రస్తుతం బ్యాకప్ అకౌంట్ ద్వారా తనకు సంబంధించిన అప్ డేట్స్‌ను షేర్ చేసుకుంటుంది చిన్మయి. ఈ విషయం గురించి చిన్మయి క్లారిటీ ఇచ్చింది.
కొందరు వ్యక్తులు (పురుషులు) వారికి సంబంధించిన అభ్యంతర ఫొటోలు నాకు డైరెక్టుగా పంపించారు. నేను పోస్టులు షేర్ చేసుకునే చోట కొంతకాలంగా ఇలా జరుగుతోంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాను. వారిపై ఫిర్యాదు చేయడంతో ఇన్స్టాగ్రామ్ నా ఖాతాను నిలిపేసింది. నా యాక్సెస్ నిలివేయడం జరిగింది. ఏదైనా సరే..అలా జరిగిందంతే..ప్రస్తుతానికి నా బ్యాకప్ అకౌంట్ chinmayi.sripada అంటూ స్పష్టత ఇచ్చింది చిన్మయి.
చిన్మయి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే. ప్రత్యేకించి #MeToo movementతో తమిళ ఇండస్ట్రీలో స్త్రీలను దోపిడికి గురిచేసే..బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడే పలువురు పెద్దల పేర్లు తెరపైకి తీసుకొచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.