ఒకప్పుడు చిన్మయి అంటే ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. మీటూ ఉద్యమం తర్వాత ఈమె పేరు మారుమ్రోగిపోయింది. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు లాంటి వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ మహిళల తరఫున ధైర్యంగా నిలబడింది. చిన్మయికి సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు ఉంది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు పలు విషయాలపై చురుకుగా స్పందిస్తుంది.తాజాగా తన ప్రగ్నెన్సీ రూమర్స్‌పై వివరణ ఇచ్చింది.
ఇటీవల చిన్నయి భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహంలో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో చిన్మయి చీరకట్టు ఉబ్బెత్తుగా ఉండడంతో చిన్మయి ప్రగ్నెంట్ అంటూ జోరుగా ప్రచారం చేశారు. మరి కొద్దిరోజులలోనే చిన్మయి తొలిబిడ్డకు జన్మనివ్వనుందని పుకార్లు పుట్టించారు. ఈ క్రమంలో చిన్మయి తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఇది మా పెళ్లి ఫొటో. మడిసార్ ధరించాను. మడిసార్ వలన నా పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది. మడిసార్ క్యారీ చేయడంలో సమస్యలు ఉన్నాయి.
మడిసార్ వలన అలా కనిపిస్తుందే తప్ప నేను ప్రగ్నెంట్ కాదు. చిన్నయి బేబి బంప్ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లలో వస్తున్న వార్తలు చూసి విసిగిపోయాను. నా పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి, సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేనె ప్రగ్రెంట్ అయినప్పుడు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు లేదా చేసుకోక పోవచ్చు. మేము వంద శాతం మా పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయను. వారు ఎలాగు సోషల్ మీడియాలో ఉండరు. ఇకనైన రూమర్స్ ఆపండి అని చిన్మయి పేర్కొంది.
Wishing my babies @subiksharaman and @Rohit_Ravindran an amazing life together 😍😍❤️ pic.twitter.com/h2FLZ6Mr18
— Rahul Ravindran (@23_rahulr) July 1, 2021