స్వీయ దర్శకనిర్మాణంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన బాలల చిత్రం ‘అభినవ్- ‘చేజ్డ్ పద్మవ్యూహ’. మంగళవారం ఈ చిత్ర పోస్టర్, ట్రైలర్ను ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, మాదకద్రవ్యాల మాఫియాను అణిచివేయాలనే సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తీశామని దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ తెలిపారు. సమాజశ్రేయస్సు కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సినిమాను తెరకెక్కించామని, అతి త్వరలో నూన్షోగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ఆయన తెలిపారు. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.