Ruhani Sharma | తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలోకి వచ్చే హీరోయిన్ రుహానీ శర్మ. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిలసౌ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్ కలెక్షన్స్ సాధించింది. కాకపోతే అప్పటి నుంచి రుహానీ తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి కూతురు ఇమేజ్ సంపాదించుకుంది. ఈమె ఏ సినిమాలో కనిపించిన కూడా నిత్య పెళ్లి కూతురు అంటూ రుహానీ శర్మ పేరు ముందు తోక తగిలిస్తున్నారు. మొదటి సినిమాలో చాలా పద్ధతిగా కనిపించడంతో.. ఈమె అందాల ఆరబోతకు దూరంగా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి అనుమానాలు అవసరం లేదని రెండో సినిమాతోనే నిరూపించే ప్రయత్నం చేసింది.
విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రెచ్చిపోయింది. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో బాగానే అందాలు ఆరబోసింది రుహానీ శర్మ. కానీ ఇప్పటివరకు ఈమెకు కోరుకున్న అవకాశాలు మాత్రం రావడం లేదు. దాంతో అందాల ఆరబోత తప్ప మరొక ఆప్షన్ లేనట్లు రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రుహానీ శర్మ కొత్త ఫోటో షూట్ విడుదలైంది. ఎప్పట్లాగే కత్తి లాంటి చూపులతో మైండ్ బ్లాక్ చేసే అందాలతో రెచ్చగొడుతుంది ఈ పెళ్లికూతురు.
ప్రస్తుతానికి సినిమాల కంటే ఎక్కువగా కమర్షియల్ యాడ్స్‌పై ఫోకస్ చేసింది ఈ భామ. అక్కడ ఈమెకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఈ మధ్యకాలంలో ఈమె నటించిన నూటొక్క జిల్లాల అందగాడు డిజాస్టర్ కావడంతో ఇంకో అవకాశం రాలేదు. మరి ఆఫర్స్ కోసం బాగా వేచి చూస్తున్న ఈ భామకు కోరుకున్న అవకాశాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Ruhani Sharma | రొమాంటిక్ ఫోజులో రుహాని శర్మ..
Ruhani Sharma | రుహానీ శర్మ అందాల ఆరబోత..
Ruhani Sharma | చిలసౌ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ !
రుహాని శర్మ గ్లామరస్ స్టిల్స్..
రుహాని శర్మ న్యూ వైరల్ పిక్స్