సాత్విక్ వర్మ, జాక్ రాబిన్సన్, రీజీమ్, నయన్ కరిష్మా, అమిర్తా హల్దార్, మంజీరాలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘చిక్లెట్స్’. ముత్తు దర్శకుడు. ఏ.శ్రీనివాసన్ గురు నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కంటెంట్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బాలమురళి, ఎడిటర్: వేలుకుట్టి.