Chianjeevi wishes Venkatesh | టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్‌ల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. ఆన్ స్క్రీన్‌లో ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక వీరిద్దరూ తరుచూ కలుస్తూనే ఉంటామని పలు సందర్భాల్లో చిరు తెలిపాడు. అంతేకాకుండా ఎవరి సినిమాలు బాగా ఆడినా ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని, తమలాగా అందరు హీరోలు సన్నిహితంగా ఉండాలని చిరు ఓ సందర్భంలో చెప్పాడు. కాగా మంగళవారం వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చిరు కూడా తన స్టైల్లో వెంకటేష్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు.
మై డియర్ వెంకీ.. పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి పార్టీ ఎక్కడా! అంటూ వెంకటేష్‌కు బర్త్‌డే విషెస్‌ను తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చిరుతో పాటు టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు వెంకటేష్‌కు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. ఇటీవలే ఓరి దేవుడా సినిమాలో మెరిసిన వెంకటేష్ ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనితో పాటుగా రానాతో కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ రిలీజ్ సిద్ధంగా ఉంది.
మై డియర్ వెంకీ… @VenkyMama
Happy Birthday 💐🎂
Where is the Party?!! pic.twitter.com/kRHhEErsLD
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2022