Geetha Govindam | ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ (Gukesh) నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అయితే చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా నిలిచిన గుకేశ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం సత్కరించడంతో పాటు రూ.5 కోట్ల చెక్కును బహూకరించారు. దీంతో పాటు చెస్‌ను ప్రోత్సహించడానికి అకాడమీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఇదిలావుంటే.. రీసెంట్గా గుకేష్‌ను ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూ చేయగా.. తనకు నచ్చిన సినిమా విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ అని తెలిపాడు. గుకేష్ మాట్లాడుతూ.. నాకు తమిళంలో సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాతో పాటు తెలుగులో గీత గోవిందం ఇష్టం అని తెలిపాడు. ఇక హిందీలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన జిందగీ నా మిలేగీ దోబారా అనే సినిమా ఇష్టం అని తెలిపాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం గీత గోవిందం. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
#GeethaGovindam film starring @TheDeverakonda & @iamRashmika
is the favorite Telugu film of World Chess Champion #GukeshDommaraju. #VijayDevarakonda#RashmikaMandanna pic.twitter.com/ZdfzyLjayW— Telugu Chitraalu (@TeluguChitraalu) December 18, 2024