యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మిస్తున్నారు. అరుణ్ భారతి ఎల్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్బీ చౌదరి మాట్లాడుతూ…‘మా సంస్థలో నిర్మిస్తున్న 94వ చిత్రమిది. ఇప్పటిదాకా పరిచయం చేసినట్లే ఈ చిత్రంలోనూ యువ ప్రతిభావంతులను ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాం. విశిష్టమైన కథా కథనాలున్న చిత్రమిది’ అన్నారు. హీరో యష్ పూరి మాట్లాడుతూ…‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. యాక్షన్, రొమాన్స్, కామెడీ వంటి అన్ని అంశాలుంటాయి. సినిమాలోని సర్ప్రైజ్లను థియేటర్లోనే చూ డాలి’ అన్నారు.