‘శుభం’ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘చీన్ టపాక్ డుండుం’. వై.ఎన్.లోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విలేజ్ టాకీస్ పతాకంపై శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర కథానాయిక సమంత క్లాప్‌నివ్వగా, దర్శకుడు మల్లిడి వశిష్ట కెమెరా స్విఛాన్ చేశారు.
వినోదప్రధానంగా సాగే కథాంశమిదని, ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. బ్రిగిడా సాగా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సంగీతం: పీఆర్, రచన-దర్శకత్వం: వై.ఎన్.లోహిత్.