ఇంద్రరామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చౌర్యపాఠం’. నిఖిల్ గొల్లమారి దర్శకుడు. నక్కిన త్రినాధ రావు నిర్మాత. శనివారం ఫస్ట్‌లుక్, టీజర్‌ను లాంచ్ చేశారు. క్రైమ్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్రామంలో దోపీడీ కోసం తన ముఠాను హీరో సన్నద్ధం చేసే సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. ైస్టెలిష్ మేకింగ్, కామెడీ అంశాలతో ఆకట్టుకుంది.
ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని అద్భుతమైన కథనందించాడని, ప్రతిభావంతులైన టీమ్‌తో రూపొందించామని నిర్మాత నక్కిన త్రినాధ రావు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రాబరీ నేపథ్యంలో సాగే కథాంశమిది. ఆద్యంతం ఉత్కంఠ, వినోదంతో సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చందూ మొండేటి, వివేక్ కూచిభొట్ల, కోనేరు సత్యనారాయణ, మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: డేవ్‌జాంద్, నిర్మాణ సంస్థ: నక్కిన నరేటివ్స్, దర్శకత్వం: నిఖిల్ గొల్లమారి.