Music 2025 | 2025 సంవత్సరం ముగింపునకు చేరుకున్న తరుణంలో, ఈ ఏడాది భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలిన టాప్ 5 పాటల గురించి గూగుల్ మరియు యూట్యూబ్ ఇండియా అధికారికంగా తమ వార్షిక నివేదికలను విడుదల చేశాయి. గత ఏడాది కాలంలో యూట్యూబ్ వ్యూస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్పాటిఫై స్ట్రీమింగ్ గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో కొన్ని అనూహ్యమైన పాటలు చోటు దక్కించుకున్నాయి. అయితే ఆ పాటలు ఏంటి అనేది చూసుకుంటే.
1. సైయారా (Saiyaara Title Song) బాలీవుడ్ సెన్సేషన్ మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘సైయారా’ సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్దే కాకుండా మ్యూజిక్ చార్ట్లలోనూ రికార్డులు తిరగరాసింది. ఫహీమ్ అబ్దుల్లా పాడిన ఈ పాట మెలోడీగా అగ్రస్థానంలో నిలవడమే కాకుండా Spotify Global Viral 50 చార్ట్‌లో తొలి భారతీయ పాటగా చరిత్ర సృష్టించింది. తనిష్క్ బాగ్చీ, అర్సలాన్ నిజామీల సంగీతం మరియు ఇర్షాద్ కామిల్ సాహిత్యం ఈ పాటను విదేశాల్లో కూడా ఫేమస్ చేశాయి.
2. రాను బొంబాయికి రాను (Ranu Bombai Ki Ranu) – ఫోక్ వైబ్ తెలంగాణ జానపద కళాకారుడు మరియు ‘బిగ్ బాస్ సీజన్-9’ కంటెస్టెంట్ రాము రాథోడ్ పాడిన ఈ పాట 2025లో ఒక సాంస్కృతిక విప్లవమే తెచ్చింది. సింగర్ ప్రభ గాత్రం, కల్యాణ్ కీస్ సంగీతం తోడై, యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలో కూడా ప్రతి పెళ్లిలోనూ, వేడుకలోనూ ఈ పాట మార్మోగిపోయింది.
3. షాకీ (Shaky – Marathi Pop) – డ్యాన్స్ ఫీవర్ మరాఠీ మ్యూజిక్ సెన్సేషన్ సంజు రాథోడ్ మరియు ఈషా మాల్వియా నటించిన ‘షాకీ’ సాంగ్ 2025లో డ్యాన్స్ ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. జూన్ నెలలో ఇది యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ చార్ట్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరింది. సాంప్రదాయ మరాఠీ ఫోక్ మరియు ఆధునిక ఆఫ్రో-బీట్స్ల మేళవింపుతో వచ్చిన ఈ పాట ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో అత్యధికంగా వాడబడిన సాంగ్‌గా నిలిచింది.
4. రాంజన్ (Raanjhan – Do Patti) కృతి సనన్, షహీర్ షేక్ జంటగా నటించిన ఎమోషనల్ హిట్ నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘దొ పత్తి’ లోని సచేత్-పరంపర అందించిన ‘రాంజన్’ పాట ఈ ఏడాది అత్యధికంగా స్ట్రీమ్ అయిన రొమాంటిక్ సాంగ్‌గా నిలిచింది. దాదాపు 246 మిలియన్ల స్ట్రీమ్స్ సాధించిన ఈ పాట, యువతలో ‘శడ్ సాంగ్స్’ కేటగిరీలో అగ్రస్థానంలో కొనసాగింది.
5. తేరి రంజోలీ బొలేగీ (Teri Ramjhol Bole Gi) – హర్యానా మేజిక్ మాసూమ్ శర్మ మరియు షీనమ్ కాథలిక్ పాడిన ఈ హర్యానా జానపద పాట ఉత్తర భారతాన్ని కుదిపేసింది. ఈ పాట యొక్క వైరల్ డ్యాన్స్ స్టెప్స్ దక్షిణాదిలో కూడా విస్తృతంగా ట్రెండ్ అయ్యాయి. పండుగల సీజన్లో ఈ పాట ప్లే చేయని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు.