Bhogi First Spark | ‘భోగి’ అంటూ వస్తున్న శర్వానంద్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అనౌన్స్మెంట్ వీడియో
Sharwanand 38 | టాలీవుడ్ నటుడు శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
Sharwanand 38 | టాలీవుడ్ నటుడు శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. మరపురాని అనుభూతిని కలిగించే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీకి భోగి అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ స్పార్క్ అంటూ అనౌన్స్మెంట్ వీడియోను పంచుకుంది. ‘‘ప్రతి రక్తపు చుక్కకు ఒక కారణం ఉంటుంది. ప్రతి పండగకు ఓ ప్రయోజనం ఉంటుంది’’ అని వీడియోలో తెలిపారు. ఈ వీడియో చూస్తుంటే శర్వానంద్ చాలారోజుల తర్వాత మాస్ మూవీ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ మూవీ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు శర్వానంద్. మే మొదటివారం నుంచి షూటింగ్ శరవేగంగా ప్రారంభంకాబోతుండగా.. ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించబోతుంది. గతంలో శర్వానంద్, అనుపమ కలిసి శతమానం భవతి అనే సినిమాలో నటించారు. దిల్ రాజ్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ జోడి మళ్లీ జత కడుతుండడంతో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్.ఎస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

