Chaari 111 Movie | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటించిన తాజా చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తికుమార్ (TG keerthy Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. యూట్యూబ్ లేటెస్ట్ సెన్సేషన్, తమిళ ముద్దుగుమ్మ సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మార్చి 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. టెర్రరిజంకు చెందిన ఒక సీక్రెట్ గ్రూప్ ఇండియాలో కోవర్ట్ ఏజెన్సీని స్టార్ట్ చేయాలనీ చూస్తుంది. ఒకవేళ అది స్టార్ట్ అయితే దేశానికి ప్రమాదం. ఇక ఇది కనిపేట్టే సీక్రెట్ స్పై ఏజెంట్‌గా వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను బర్కత్ స్టూడియెస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మించింది.
#Chari111 streaming on #AmazonPrimeVideo @samyukthavv pic.twitter.com/7ntWIEVHpw
— KLAPBOARD (@klapboardpost) April 5, 2024