Vennela Kishore | వెన్నెల కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తికుమార్ దర్శకుడు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించారు. మార్చి 1న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ సోమవారం ఆవిష్కరించారు.
ట్రైలర్ జస్ట్ శాంపిల్ మాత్రమేనని, సినిమాలో మరింత రెట్టింపు వినోదం ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకుల్ని ‘చారి 111’ కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పారు. మురళీశర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావనిరెడ్డి, తాగుబోతు రమేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: కషిష్ గ్రోవర్, సంగీతం: సైమన్ కె కింగ్, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి.