Chandramukhi 2 | రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. పి.వాసు దర్శకుడు. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. కంగనా రనౌత్ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రాజు వేషంలో రాజసం, పొగరుతో పాటు క్రూరత్వం కలబోసిన పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. “చంద్రముఖి’ చిత్రం హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
అదే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. లారెన్స్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. హారర్‌తో పాటు వినోదం కూడా ఉంటుంది’ చిత్రబృందం పేర్కొంది. వడివేలు, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, విఘ్నేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి.రాజశేఖర్, ఆర్ట్: తోట తరణి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, దర్శకత్వం: పి.వాసు.