Chandramukhi 2 | యాక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) హీరోగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి 2 (Chandramukhi 2). పాపులర్ డైరెక్టర్ పీ వాసు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ (Kangana Ranaut) టైటిల్ రోల్ పోషించింది. ఇక హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే జనాల్లో అంచనాలుండటం సహజమే. అందులోనూ ఎవర్గ్రీన్ లాంటి చంద్రముఖి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. కానీ ఆ అంచనాలను చంద్రముఖి 2 అందుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్గా మిగిలింది.
కథ, కథనం, టేకింగ్ ఏది కూడా కొత్తగా లేకపోవడం.. పై పెచ్చు గ్రాఫిక్స్ దరిద్రంగా ఉండటంతో జనాలు చంద్రముఖి-2 సినిమాను తిప్పి కొట్టారు. అసలు లారెన్స్ ఈ కథను ఎలా ఒప్పుకున్నాడో అతనికే తెలియాలంటూ ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. అయితే పోటీగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో కొంత వరకు ప్రొడ్యూసర్లకు ఈ సినిమా నష్టాలు మిగిల్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
Vettaiyan Raaja v̶a̶r̶a̶a̶r̶ vanthuvittaar!👑
Chandramukhi 2 is now streaming on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! #Chandramukhi2OnNetflix pic.twitter.com/wwQHp60i7v
— Netflix India South (@Netflix_INSouth) October 26, 2023
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా చంద్రముఖి 2 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత ఎమ్.ఎమ్ కీరవాణి స్వరాలు కూర్చాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ సుభాస్కరణ్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించాడు. చంద్రముఖి 2లో లెజెండరీ కమెడియన్ వడివేలు కీ రోల్లో నటించాడు.