జీవీ 9 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘చమన్’ (ఎడారిలో పుష్పం). వెంకట్ సన్నిధి దర్శకత్వంలో జీవి చౌదరి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ ‘నేనెంతగానో అభిమానించే దివంగత చమన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
అక్టోబర్‌లో నటీనటుల వివరాల్ని తెలియజేస్తాం’ అన్నారు. ‘ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న చమన్ జీవిత కథను డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా’ అని దర్శకుడు వెంకట్ సన్నిధి తెలిపారు. ఈ సినిమాలో అందరిని ఆకట్టుకునే అంశాలుంటాయని కెమెరామెన్ రామ్‌ప్రసాద్ చెప్పారు.