Chalapathi Rao Last Rites | సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో చలపతిరావు దహన సంస్కారాలు జరిగాయి. ఈ నెల 24న చలపతిరావు మరణించగా, ఆయన కుమార్తెలు విదేశాల్లో ఉండటంతో అంత్యక్రియలను ఇప్పటివరకు నిర్వహించలేదు. దాంతో చలపతిరావు భౌతిక కాయాన్ని మూడు రోజులు ఫ్రీజర్‌లో పెట్టారు. కాగా మంగళవారం చలపతిరావు కుమార్తెలు హైదరాబాద్‌కు చేరుకోవడంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. ‘గూఢాచారి 116’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చలపతి రావు సహాయ నటుడిగా, విలన్‌గా, కమేడియన్‌గా 1200లకు పైగా చిత్రాల్లో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూ. ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి చలపతిరావు వెండితెర పంచుకున్నారు. చివరగా చలపతిరావు బంగార్రాజు సినిమాలో నటించాడు. ఇక ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.