Tanya Abrol Wedding| ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్ళిళ్ల సీజన్ నడుస్తుంది. ఇటీవలే కియారా-సిద్ధార్థ్ మల్హోత్రాలతో పాటు నేనింతే హీరోయిన్ సియా గౌతమ్ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కాగా తాజాగా మరో బాలీవుడ్ నటి తన బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? ‘చక్‌దే ఇండియా’ సినిమాతో బాలీవుడ్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న తాన్యా అబ్రోల్ తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాన్యా ‘చక్‌దే ఇండియా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే మంచి క్రేజ్ తెచ్చిపెట్టడంతో అవకాశాలు క్యూ కట్టాయి. అయితే చక్‌దే సినిమా తప్పితే మరేది తాన్యా కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. దాంతో సీరియల్స్‌లో తన అదృష్టం పరిక్షించుకుంది. ‘పాలమూర్ ఎక్స్‌ప్రెస్’, ‘కుచ్ తో లగ్ కహేంగే’ వంటి సీరియల్స్ తాన్యాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీటితో పాటుగా పాపులర్ సిరీస్ ‘సీఐడి’లోనూ నటించింది. ఇక ‘మిలే నా మిలే హుమ్’ అనే పంజాబీ సినిమాలోనూ తాన్యా ఓ కీలకపాత్రలో నటించింది.