Dil Diya | కీడా కోలా, ఘాటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో చైతన్య రావు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన కథానాయకుడిగా దర్శకుడు కె. క్రాంతి మాధవ్ కాంబినేషన్లో ఒక నూతన చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు ‘దిల్ దియా’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ‘ఏ నేక్డ్ ట్రూత్’ (A Naked Truth) అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో చైతన్య సోఫాలో నగ్నంగా కూర్చోవడం చాలా విభిన్నంగా అనిపిస్తుంది. ఈ సినిమా థీమ్‌ను ప్రతిబింబించేలా ఫస్ట్ లుక్ ఉండటంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చైతన్య రావు ఈ సినిమాలో గత చిత్రాల కంటే భిన్నమైన గెటప్‌లో కనిపిస్తుండటం విశేషం.
శ్రియాస్ చిత్రాస్, ఎ.పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై పూర్ణ నాయుడు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. క్రాంతి మాధవ్ మార్క్ ఎమోషన్స్, చైతన్య రావు నటన ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Here’s the first look poster of my dear friend’s @bykranthi 5th film 🔥
WISHING YOU ALL THE LUCK 🤗
CONGRATULATIONS 🎊 Poster is very intriguing and deep 🤝#DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres… pic.twitter.com/4YrwlglagQ— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026