తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో పాపులర్ అయిన చాయ్‌బిస్కెట్ సంస్థ ‘చాయ్ షాట్స్’ పేరుతో కొత్త ఓటీటీ వేదికను మొదలుపెట్టింది. షార్ట్ సిరీస్ కంటెంట్ ప్రొడక్షన్ ప్రధానంగా ఈ ఓటీటీ పనిచేయనుంది. సోమవారం ‘చాయ్ షాట్స్’ ఓటీటీ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో రానా దగ్గుబాటి, అగ్ర నిర్మాత వై.రవిశంకర్ తదితరుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ ‘చాయ్ షాట్స్‌ని మేము రెండు నెలల క్రితం లాంచ్ చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. చైనా, యుఎస్, కొరియా, జపాన్ వంటి దేశాల్లో షార్ట్ సిరీస్ కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో తొలిసారి ఈ కాన్సెప్ట్ ప్రధానంగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేస్తున్నాం. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నాం.
త్వరలో అన్ని భాషల్లో లాంచ్ చేస్తాం’ అన్నారు. కెరీర్ ఆరంభం నుంచి కొత్త కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని, సరికొత్త ఫీచర్స్‌తో చాయ్షాట్స్ను లాంచ్ చేశామని, తెలుగు డిజిటల్ మీడియాలో ఇదొక ప్రయోగమని చాయ్ బిస్కెట్ అనురాగ్ రెడ్డి తెలిపారు. ఈ ఓటీటీలో హీరో రానాతో పాటు స్విగ్గీ, రెడ్‌బస్, ఫిజిల్స్వాలా, రాపిడో, డార్విన్‌బాక్స్, విర్జియో వంటి సంస్థలు ఇన్వెస్టర్లుగా ఉన్నారు.