Chadalavada Srinivasa Rao | ఓటీటీల వలన చిన్న సినిమాలు నష్టపోతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. జబర్తస్థ్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుంది. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ బగవాన్, జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదలవాడ మాట్లాడుతూ.. పెద్ద సినిమాలు పుట్టడానికి కారణం చిన్న సినిమాలు. చిన్న సినిమాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. పెద్ద సినిమాలు అంతా మార్కెట్ పెరుగుతూ ఉంటాయి. సినిమాను థియేటర్‌కు వెళ్లి చూసినప్పుడే ఆ ఫీల్ ఉంటుంది. దయచేసి ఓటీటీలను ఎంకరేజ్ చేయకండి. ఈ మధ్య పెద్ద హీరోలు అందరూ మా సినిమాలను థియేటర్లోనే చూడండి అని చెబుతున్నారు. కానీ వారి సినిమాలు ఆడకపోవడం వలనో లేదా లాభం కోసమో ఓటీటీలకు అమ్మేస్తున్నారు. ఇలా చేయడం వలన చిన్న సినిమాలకు చాలా నష్టం జరుగుతుంది. దయచేసి చిన్న సినిమాలను కూడా థియేటర్లోనే చూడండి. పెద్ద హీరోలనే కాకుండా చిన్న హీరోలను కూడా ఎంకరేజ్ చేయండి అంటూ చదలవాడ శ్రీనివాసరావు చెప్పుకోచ్చాడు.