సిరివెన్నెల మరణం సాహిత్యలోకానికి చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు. నవంబర్ 30 సాయంత్రం సిరివెన్నెల మరణించగా, ఆయన పార్థివదేహాన్ని అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్లో ఉంచారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే రాజమౌళి, కీరవాణితో పాటు పలువురు ప్రముఖులు సిరివెన్నెల పార్ధివదేహానికి నివాళులు అర్పించారు.
సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి.. ఆయన మరణం జీర్ణించుకోలేదని చెప్పారు. ఆయన నాతో మాట్లాడి తిరిగి వస్తానని అన్నారు. కాని జీవం లేకుండా వస్తారని అనుకోలేదు. ఆయన చివరిగా ఎక్కువసేపు మాట్లాడింది నాతోనే అన్నారు. నన్ను ఉద్దేశించి పాటలు రాసానని చెప్పినప్పుడు చాలా ఉప్పొంగిపోయాను. ఆయన నా గురించి రాయడం నా పూర్వజన్మ సుకృతి అన్నారు మెగాస్టార్.
సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన బాలయ్య.. సిరివెన్నెల శాస్త్రిగారు శాశ్వతంగా మిగిలిపోతారు. జనని జన్మ భూమి సినిమాలో మొదటి పాట రాసారు. ఆయన ఎందరికో స్పూర్తి. చలన చిత్ర పరిశ్రమ తీరని లోటు అంటూ ఎమోషనల్ అయ్యారు బాలయ్య.. ఇద్దరం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం.. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిని పొందేవాడిని అన్నారు బాలయ్య.
సీతారాం శాస్త్రిగారు చాలా ఇష్టమైన వ్యక్తి.. సిరివెన్నెల నా కుటుంబసభ్యులు అన్నారు అల్లు అర్జున్. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వారు మళ్లీ పుట్టరు అంటూ ఎమోషనల్ అయ్యారు బన్నీ. ఇక నాని నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మట్లాడేందుకు కూడా నిరాకరించారు. ఈ సమయంలో మాటలు కూడా రావని అన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని హాజరై సిరివెన్నెలకు నివాళులు అర్పించారు.