ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. రవికిశోర్ దర్శకుడు. ఎన్.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య నిర్మాతలు. వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ఇందులో కీలక పాత్రధారులు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. యాక్షన్, సస్పెన్స్ అంశాలతో కూడిన సినిమా ఇదని టీజర్ చెబుతున్నది. రూమర్లు, పుకార్లను బేస్ చేసుకొని దర్శకుడు రవికిశోర్ ఈ కథ తెరకెక్కించినట్టు తెలుస్తున్నది. సుదర్శన్ యాక్టింగ్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఆడియన్స్‌కి కనెక్టయ్యే సబ్జెక్ట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని పరుచూరి వెంకటేశ్వరరావు అభిలషించారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులతోపాటు అతిథిగా విచ్చేసిన రచయిత సాయిమాధవ్ బుర్రా కూడా మాట్లాడారు. ఈ సినిమాకు కెమెరా: శివకుమార్ దేవరకొండ, సంగీతం: వినోద్ యజమాన్య. నిర్మాణం: ఆర్పీ సినిమాస్.