RCB | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు 18 ఏళ్ల ఐపీఎల్ ట్రోఫీ కలని నెరవేర్చుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో, రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు అభినందల వర్షం కురిపించారు. ఆర్సీబీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 18 ఏళ్ల నిరీక్షణకి ముగింపు పలికినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయానికి మీరు అర్హులు అని వెంకటేష్ అన్నారు. ఇక అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో నిరీక్షణ ముగిసింది. ఈ సలా కమ్ నమ్దే. ఈ రోజు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం అని కామెంట్ చేశారు.
ఇక రష్మిక తన సోషల్ మీడియాలో గెలుపు సువాసనలు విరజిమ్ముతున్నాయని పేర్కొంది. ఇక విజయ్ దేవరకొండ ఆర్బీబీ టీమ్‌తో పాటు అభిమానులకి కూడా కంగ్రాట్స్ చెప్పారు. హ్యాపీ మూమెంట్స్ అని రాసుకొచ్చారు. ఇక వరుణ్ తేజ్.. 18 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న టైటిల్ సొంతం చేసుకున్నందుకు ఆర్సీబీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ట్రోల్స్, ఓటములు.. వాటన్నింటిన భరిస్తూ ధైర్యంగా ముందుకు సాగిన ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనతో కప్ గెలుచుకుంది. ఎప్పుడు నిరాశపకడకుండా విజయం కోసం కొన్నేళ్లుగా కృషి చేసింది ఆర్సీబి. మీ అభిమానులంతా గర్వంగా చెప్పుకొనే విజయం ఇది అని సాయి తేజ్ అన్నారు.
ఇక దీని కోసం కదా ఇన్నేళ్లుగా ఎదురు చూసింది అని రణ్వీర్ సింగ్ రాసుకొచ్చాడు. ఇది ఒక చరిత్రాత్మక విజయం,18 ఏళ్ల పట్టుదల కృషి, కల సాకారం అయింది. టీమ్‌కి అభినందనలు అని సుధీర్ బాబు రాసుకొచ్చాడు. ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. 18 ఏళ్లు.. దాదాపు 18 ఏళ్లు.. గెలిచినా, ఓడినా ఒక జట్టునే సపోర్ట్ చేస్తూ వస్తున్న ఫ్యాన్స్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు.