Celebrities |టాలీవుడ్లో ప్రస్తుతం ఓజీ ఫీవర్ నడుస్తుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ నేడు గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, సినీ ప్రముఖుల్లో కూడా భారీ క్రేజ్ కనిపిస్తోంది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో సినిమా పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే థియేటర్లలో జోష్ కనిపిస్తుండగా, ఇప్పుడు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతల ట్వీట్లతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.
డైరెక్టర్ బాబీ:
“బిగ్ స్క్రీన్‌పై అసలైన ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ను చూసే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్బ్, డైరెక్టర్ సుజీత్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. తమన్ మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేం. ఇది నిజంగా బ్లాక్‌బస్టర్ మూవీ!”
నిర్మాత నాగవంశీ:
“‘ఓజీ’ నిజంగానే ఫైర్‌స్టార్మ్ మాదిరిగా దూసుకెళ్తోంది. ఇంట్రో, ఇంటర్వెల్, పోలీస్ స్టేషన్ సీన్లు ప్యూర్ గూస్బంప్స్. పవన్ స్వాగ్, ఆటిట్యూడ్ అదరగొట్టేశాయి. తమన్ బీజీఎం ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోసింది. హంగ్రీ చీతా వేట మొదలైంది!”
ప్రొడ్యూసర్ SKN:
“‘ఓజీ’ పక్కా ఫ్యాన్స్ ఫీస్ట్. దసరా సీజన్లో దీపావళిని తెచ్చింది. పవన్ గ్రేసియస్ ప్రెజెన్స్, సుజీత్ డైరెక్షన్, తమన్ సంగీతం కలిసి స్టన్నింగ్ బ్లాక్‌బస్టర్‌గా మార్చేశాయి.”
హీరో నాని:
వేరే వాళ్ల మాటలు వినకండి. ‘ఓజీ బ్లాక్‌బస్టర్ అంతే. పవన్ కళ్యాణ్ గారు, సుజీత్, తమన్, ఓజీ టీమ్‌కి అభినందనలు.” అంటూ ట్వీట్స్ చేశారు. ఇక మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ థియేటర్లో సామాన్యుల మాదిరిగా రచ్చ చేశారు. పేపర్స్ విసురుతూ, గోల చేస్తూ నానా హంగామా చేశారు. అకీరా, ఆద్య కూడా తన తండ్రి సినిమాని చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమాలో పవన్ ఎంట్రీ సీన్, యాక్షన్ బ్లాక్స్, పవర్ఫుల్ డైలాగులు ప్రేక్షకులను థియేటర్లలో కుర్చీల్లో కూర్చోనివ్వకుండా చేస్తున్నాయి. తమన్ అందించిన BGM మాస్ ఆడియన్స్‌కి చక్కటి ట్రీట్‌గా నిలుస్తోంది. ‘ఓజీ’తో సుజీత్ తన టేకింగ్, విజన్‌ను నిరూపించుకున్నాడని పరిశ్రమ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.