Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. లండన్‌కు పయనమైన ఎయిర్ ఇండియా విమానం, గాల్లోకి లేచిన కొద్ది నిమిషాలకే నేలకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి దట్టమైన నల్లటి పొగలు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 12 మంది ఎయిర్ లైన్స్ సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ప్రమాద ఘటనపై రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాలలో కుప్పకూలిందనే వార్త నన్నెంతో కలిసి వేసిందని జాన్వీ కపూర్ అన్నారు. ఆ బాధని మాటల్లో వర్ణించలేము అని పేర్కొంది.
ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి తెలిసి నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్ధిస్తున్నాను అని ఎన్టీఆర్ అన్నారు. ఇక మంచు విష్ణు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రేపు జరగాల్సిన కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని కూడా క్యాన్సిల్ చేశారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాల కోసం ప్రార్ధిస్తున్నాను అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను షాక్‌కి గురి చేసింది. మాటలు రావడం లేదు. బాధిత కుటుంబాల కోసం ప్రార్ధిస్తున్నాను అని అక్షయ్ కుమార్ అన్నారు. ప్రాణాలతో బయటపడిన వారికి తక్షణమే సాయం అందిచాలని కోరుకుంటున్నాను అని దిశా పటాని పేర్కొఇంది. బాధిత కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. రకుల్ ప్రీత్ సింగ్, అనుపమ్ ఖేర్, రితేష్ దేశ్ ముఖ్, ప్రగ్యా జైస్వాల్ వంటి ప్రముఖులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.