Jr Ntr – Hrithik Roshan | అగ్రనటులు ఎన్.టి.ఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అయితే సినిమాకు ‘U/A ‘ సర్టిఫికేట్ ఇచ్చే ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చిత్రయూనిట్‌కి కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. వాటిలో ముఖ్యంగా, హీరోయిన్ కియారా అద్వానీకి సంబంధించిన బికినీ సన్నివేశంలో 9 సెకన్ల విజువల్స్‌ను తొలగించాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆవన్ జావన్’ అనే పాటలో కనిపించే ఈ బికినీ సీన్‌ను 50 శాతం మేర తొలగించాలని సెన్సార్ బోర్డు కోరినట్లు సమాచారం. దీనికి మేకర్స్ మొదట అంగీకరించకపోగా.. విడుదల తేదీ దగ్గరపడడంతో తగ్గినట్లు తెలుస్తుంది.