Gangavva | బిగ్ బాస్ కంటెస్టెంట్, ‘మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో గంగవ్వ, యూట్యూబర్ రాజులు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను ఉల్లంఘించారంటూ అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో రామ చిలుకని ఉపయోగించి యూట్యూబర్ రాజు, గంగవ్వ కలిసి ఒక వీడియో చేశారు. అయితే ఈ వీడియోలో యూట్యూబ్ ప్రయోజనాల కోసం రామ చిలుకను హింసించి వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను ఉల్లంఘించారంటూ స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ అనే వ్యక్తి జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన అటవీశాఖ పోలీసులు గంగవ్వతో పాటు యూట్యూబ్ రాజులపై కేసు నమోదు చేశారు. అయితే వీడియో కోసం ఈ చిలుకను కొండగట్టు దేవాలయం సమీపంలోని ఓ జ్యోతిష్యుడు దగ్గర నుంచి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే గంగవ్వపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె హౌజ్ నుంచి బయటకు వచ్చేవరకు ఆగుతారా లేదా హౌజ్‌కి నోటిసులు పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.