Bellamkonda | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో సత్తా చాటిన సురేష్‌పై ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కబ్జా కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 7లో ఉన్న ఒక ఇంటిని బెల్లంకొండ సురేష్ అక్రమంగా ఆక్రమించారంటూ శివ ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాను కొంతకాలంగా బంధువుల వద్ద ఉంటున్నానని, ఈ సమయంలో బెల్లంకొండ సురేష్ అనుచరులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శివ ప్రసాద్ ప్రకారం, ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేసి, గోడలకు కూడా నష్టం కలిగించారని ఆరోపించారు. ఆయన తిరిగి ఇంటికి వచ్చి పరిస్థితిని చూసి షాక్‌కు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు IPC సెక్షన్లు 329(4), 324(5), 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.శివ ప్రసాద్ సిబ్బంది బెల్లంకొండ సురేష్ ఇంటికి వెళ్లి ఈ విషయంపై మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాగ్వాదం, దాడి ప్రయత్నం జరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ వైపు నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఈ ఘటన టాలీవుడ్ వర్గాల్లో, ముఖ్యంగా ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.గతంలో “ఆది”, “కందిరీగ”, “బాడీగార్డ్”, “చెన్నకేశవరెడ్డి”, “రభస”, “అల్లుడు శ్రీను” వంటి హిట్ సినిమాలతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్, కొన్నేళ్లుగా నిర్మాణానికి దూరంగా ఉన్నారు.బెల్లంకొండ కుటుంబం మాత్రం ఇండస్ట్రీలో కొనసాగుతోంది.ఆయన పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు సీను’, ‘జయజానకినాయక’, ‘సీత’, ‘కిష్కింధపురి’ వంటి చిత్రాలతో హీరోగా స్థిరపడేందుకు కృషి చేస్తున్నాడు. చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్‌పై నమోదైన కేసు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారగా, ఆయన స్పందన కోసం సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.