Vijayakanth | 27 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ.. అవార్డుల రారాజుగా నిలిచిన విజయకాంత్
Vijayakanth | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ స్టార్ నటుడు, డీఎండీకే (DMDK) అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కన్నుమూశారు.
Vijayakanth | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ స్టార్ నటుడు, డీఎండీకే (DMDK) అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసు 71. విజయకాంత్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
27 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు విజయకాంత్. 1979లో ‘ఇనిక్కుమ్ ఇలమై’ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకూ నిర్విరామంగా నటించారు. సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషం. 20కి పైగా పోలీసు కథల్లోనే నటించి మెప్పించారు. విజయకాంత్ దర్శకత్వం వహించి, నటించిన చిత్రం విరుధగిరి. వల్లారసు, నరసింహ, సగప్తం చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన చివరిసారిగా 2015లో వచ్చిన ‘సగప్తం’ చిత్రంలో కనిపించారు.
విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికి కూడా ఆయన సుపరిచితమే. ఆయన నటనకు గానూ ఎన్నో అవార్డులు వరించాయి. 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్ అవార్డు), 2001లో ‘కళైమామణి అవార్డు’ (తమిళనాడు ప్రభుత్వం) అందుకున్నారు. 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్’ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్) వంటి అవార్డులు పొందారు. అదేవిధంగా 1986లో ‘అమ్మన్ కోయిల్ కిజకలే’ (Amman Kovil Kizhakale) చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్, సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు వరించాయి.
Also Read..
Vijayakanth | కెప్టెన్ ‘ప్రేమ’ వివాహం..
Vijaykanth | ఒకే ఏడాదిలో 18 సినిమాలు విడుదల.. విజయకాంత్‌కు కెప్టెన్ పేరు ఎలా వచ్చిందంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

