Vijaykanth | చెన్నై : తమిళ నటుడు విజయకాంత్ తన కెరీర్లో తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. తెలుగు, హిందీలో డబ్ అయి మంచి విజయాలు సాధించాయి. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా సినీ రంగంలోకి విజయకాంత్ అడుగుపెట్టారు. 150కి పైగా చిత్రాల్లో నటించిన విజయకాంత్ 27 ఏండ్ల వయసులో తెరంగ్రేటం చేశారు. 2015 వరకు సినిమాల్లో నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషం. 20కి పైగా పోలీసు కథల్లోనే నటించి మెప్పించారు. విజయకాంత్ దర్శకత్వం వహించి, నటించిన చిత్రం విరుధగిరి. వల్లారసు, నరసింహ, సగప్తం చిత్రాలను నిర్మించారు. విజయకాంత్ నటించిన ఆఖరి చిత్రం సగప్తం(2015).
కెప్టెన్ ప్రభాకరన్ అనే చిత్రం ద్వారా విజయకాంత్‌కు కెప్టెన్ అని పేరు పెట్టారు. ఈ సినిమా 1992లో విడుదల కాగా, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం విజయకాంత్ 100వ చిత్రం. కెప్టెన్ ప్రభాకరన్ విజయం తర్వాత ఆయనను కెప్టెన్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు.