Vijayakanth | రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విజయకాంత్.. 2011లో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న కెప్టెన్
Vijaykanth | తమిళ నటుడు విజయకాంత్ ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005, సెప్టెంబర్ 14వ తేదీన దేశీయ మురుపొక్కు ద్రవిడ ఖజగం(డీఎండీకే) అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ మధురైలో పురుడు పోసుకుంది.
Vijayakanth | చెన్నై : తమిళ నటుడు విజయకాంత్ ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005, సెప్టెంబర్ 14వ తేదీన దేశీయ మురుపొక్కు ద్రవిడ ఖజగం(డీఎండీకే) అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ మధురైలో పురుడు పోసుకుంది. 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. కానీ విజయకాంత్ ఒక్కరే నాటి ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మళ్లీ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 2011-16 మధ్య తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. 2006లో విరుధచలం, 2011లో రిషివండియం నియోజకవర్గాల నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఇలా నటుడు, పొలిటీషియన్‌గా కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు.
2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు. 41 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 29 స్థానాల్లో గెలుపొంది, ప్రతిపక్ష హోదాను పొందారు. నాటి ఎన్నికల్లో డీఎంకేను ఓడగొట్టేందుకు డీఎండీకే, అన్నాడీఎంకే కలిసి తీవ్రంగా శ్రమించాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీఎండీకే, బీజేపీతో జతకట్టింది. ఆ సమయంలో డీఎండీకేకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖలు అందజేశారు. దాంతో డీఎండీకే ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

