Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ (Killer Killer) నెట్టింటిని షేక్ చేస్తోంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్‌గా ఎర్రటి స్కార్ప్ కట్టుకొని చేతిలో తుపాకీతో అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
తాజాగా కెప్టెన్ మిల్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ అందించింది ధనుష్ అండ్ టీం. ఈ సీజన్ బిగ్గెస్ట్ ఈవెంట్.. కెప్టెన్ మిల్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి షురూ కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడీ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. యాక్టింగ్ మాన్స్టర్ ధనుష్.. కెప్టెన్ మిల్లర్ Blood Bath (రక్తపాతం) ఆన్ ది వే అంటూ ఇప్పటికే నెట్టింట క్యూరియాసిటీ పెంచేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
ధనుష్ కామ్రేడ్ అవతార్‌లో సమరానికి అందరినీ మేల్కొలుపుతున్నట్టుగా ఉన్న కెప్టెన్ మిల్లర్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. పొంగళ్ కానుకగా జనవరి 2024లో రిలీజ్ కానుంది.
కెప్టెన్ మిల్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం..
Buckle up for the Biggest Event of this season 💥#CaptainMiller Grand Pre Release Event Tomorrow , 6PM onwards at Nehru Indoor stadium, Chennai 😎
#CaptainMillerPongal 🥳@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @saregamasouth pic.twitter.com/SVq13v0hpZ
— Sathya Jyothi Films (@SathyaJyothi) January 2, 2024
The Blood Bath… #CaptainMilIer From Pongal 2024! @dhanushkraja ACTING MONSTER pic.twitter.com/7KMdRMgMq9
— Chowdrey (@Chowdrey_) December 22, 2023
కిల్లర్ కిల్లర్.. కెప్టెన్ మిల్లర్ సాంగ్..
కెప్టెన్ మిల్లర్ టీజర్..