Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాకు అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించగా.. కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇక పోంగల్ కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. అయితే థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం నెల తిరగకుండానే ఓటీటీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ఫిబ్రవరి 08 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇండియన్ ఇండిపెండెన్స్ కు ముందు జరిగిన స్టోరీ ఆధారంగా ఈ సినిమా రాగా.. బ్రిటీష్ పాలన నుంచి తన ప్రాంతాన్ని రక్షించే స్థానిక విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ పాత్రలో ధనుష్ ఇందులో కనిపించాడు.
what makes a soldier go rogue? the answer lies in Miller’s journey#CaptainMillerOnPrime, Feb 9 @dhanushkraja @priyankaamohan @ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @SathyaJyothi pic.twitter.com/EknEyYNW7O
— prime video IN (@PrimeVideoIN) February 2, 2024
ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్బ్లిక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.