ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మాతలు. ధనుష్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలోని ‘క్రీనీడలే..’అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాష్ స్వరపరచిన ఈ పాటకు రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించారు. జావేద్ అలీ ఆలపించారు.
ఈ పాటలో ధనుష్, ప్రియాంక అరుళ్ మోహన్ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ‘1930-40 నేపథ్యంలో పీరియాడిక్ ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నాం. టీజర్‌కు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్.