Dhanush | 1930 నుంచి 1940 మధ్య కాలంలో జరిగిన కథాంశంతో జాతీయ ఉత్తమనటుడు ధనుష్ నటిస్తున్న పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. టి.శరవణన్, సాయిసిద్ధార్థ్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకోసం జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచిన ‘కిల్లర్.. కిల్లర్’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రాకేందుమౌళి రాసిన ఈ పాటను గాయకుడు హేమచంద్రతో కలిసి ధనుష్ స్వయంగా పాడారు.
ఈ పాట, దానికి సంబంధించిన విజువల్స్ అద్భుతం అనిపించేలా ఉన్నాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ప్రియాంక అరుళ్మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ శివరాజ్‌కుమార్, సందీప్‌కిషన్ ప్రత్యేక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ నుని.