Captain Millar | కోలీవుడ్ నటుడు ధనుష్(Dhanush), ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) జంటగా నటిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’(Captain Miller). అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వరుస అప్డేట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘కిల్లర్ కిల్లర్’(Killar Killar) విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. క్రీనీడలే (Kree Needale) అంటూ సాగే రెండో పాటను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
The #CaptainMiller Second Single is Dropping Tomorrow at 5 PM 💥#UnOliyile #KreeNeedale #TuRoshni
Let The Countdown To Musical Bliss Begin!
A @gvprakash Musical 🎶
@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna@sundeepkishan @priyankaamohan @saregamasouth @SathyaJyothi pic.twitter.com/8tgRIIcnq7— Vamsi Kaka (@vamsikaka) December 22, 2023
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో వస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar)తో పాటు సందీప్ కిషన్, నివేదితా సతీశ్, ఎడ్వర్డ్ సొన్నెన్బ్లిక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది.