ఆర్ఆర్ఆర్.. రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కళాఖండం. మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా విజయవంతంగా నడుస్తున్నది. యూఎస్ థియేటర్లలో ఈ సినిమాను ప్రముఖులు వీక్షించి, సోషల్మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీంతో ఫారిన్ ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా ఈ సినిమాలోని నాటునాటు పాటే వినిపిస్తున్నది. ఈ పాటపై స్టెప్పులేస్తూ నెటిజన్లు రీల్స్ చేస్తున్నారు. కాగా, ఈ పాట సాఫ్ట్వేర్ దిగ్గజం క్యాప్జెమిన చైర్మన్ పాల్ హెర్మలిన్ను కూడా ఆకట్టుకున్నది. ఈ పాటపై ఆయన ఏకంగా తన లింక్డ్ ఇన్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. అది ఇప్పుడు వైరల్గా మారింది.
‘రెండేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాను. మూడు రోజుల పర్యటన తర్వాత తిరుగుపయనమయ్యాను. ఇండియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పాట ఏదని నా ఫ్రెండ్ మురళిని అడిగాను. అతడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాచోనాచో (హిందీ) వీడియోను నాకు పంపించాడు. ఈ వీడియో కొద్దిరోజుల కిందటే విడుదలైంది. కానీ ఇది ఇప్పుడు ఆచారం..ఓ ఉత్సవంలా మారిపోయింది. ఈ పాటపై మీరు స్టెప్పులేయగలరా? నా ఇండియన్ ఫ్రెండ్స్ నుంచి వీడియోలు ఆహ్వానిస్తున్నా.. అని పాల్ హెర్మెలిన్ లింక్డ్ ఇన్లో వీడియో షేర్ చేశారు. ఈ సవాల్ ప్రస్తుతం ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉంది.