Cannes Festival | ప్రతిష్టాత్మక 78వ కేన్స్ ఉత్సహాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. మే 24 వరకు ఈ వేడుక జరగనుండగా, ఈ వేడుకలో అందాల భామలు సందడి చేశారు. భారతీయ సినీ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, ఊర్వశీ రౌతేలా, జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, కరణ్ జోహార్ తదితరులు వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ దర్శకురాలు పాయల్ కపాడియా జ్యూరీ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. అలియా భట్ కూడా వేడుకకి హాజరు కావల్సి ఉండగా, భారత్ -పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చిన తొలి అవకాశాన్ని మిస్ చేసుకుంది.
ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్ చేస్తూ హాట్ లుక్స్‌తో అదరగొట్టే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా సెన్సేషన్‌గా మారింది. కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తళుక్కున మెరిసి అదరగొట్టింది. కొంత కాలంగా కేన్స్‌లో మెరుస్తూ సందడి చేసిన ఈ భామ తాజాగా రంగు రంగుల ధస్తులు ధరించి చిలుక ఆకారంలో ఉన్న క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ని పట్టుకొని వచ్చింది. ఆమె పట్టుకున్న చిలుక బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. నీలం, ఎరుపు, పసుపు రంగులలో స్ట్రాప్ లెస్ స్ట్రక్చర్డ్ డ్రెస్‌లో హోయలు పోయిన ఊర్వశి మ్యాచింగ్ టియారాతో తన లుక్‌ని కంప్లీట్ చేసింది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగ్ పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ పోజులిచ్చింది.
అయితే ఈ క్లచ్ ను జుడిత్ లీబర్ తయారు చేశారని, బ్యాగ్ ధర 5495 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.468064.10 అని ఇన్‌స్టా పేజీ డైట్ సబ్యా పేర్కొంది. అయితే ఊర్వశి డ్రెస్ డిజైన్ మెషీన్ స్టూడియాలా అందంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ అమ్మడు 2025లో వచ్చిన డాకు మహరాజ్ చిత్రంలో బాలయ్యతో చిందులేసి తెలుగు ప్రేక్షకులని అలరించింది. ఈ వేడుకలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొననున్నారు. కనుల పండుగగా ఈ కార్యక్రమం జరుగుతుంది.