Cannes | ప్రపంచ చలనచిత్ర వేడుకల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. మే 13 నుండి 24, 2025 వరకు జరిగే 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంతో మంది ఇండియన్ స్టార్స్ సందడి చేయనున్నారు. వారితో పాటు హాలీవుడ్ ప్రముఖులు కూడా హంగామా చేయనున్నారు. అయితే మన ఇండియన్స్ ఎవరెవరు రెడ్ కార్పెట్‌పై సందడి చేయబోతున్నారనే విషయం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆలియా భట్ కేన్స్ 2025 కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఈ ఫెస్టివల్లో ఆమె పాల్గొనడం తొలిసారి కావడంతో, ఆమె దుస్తుల ఎంపిక రెడ్ కార్పెట్ లుక్ ఎలా ఉంటుందనే చర్చలు మొదలయ్యాయి.
ఇక అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ కూడా తన కేన్స్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తోంది. ఫ్యాషన్ ను బాగా ఫాలో అయ్యే జాన్వీ కపూర్.. ఈసారి కేన్స్ లో ఎలా అదగొడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన డ్రెస్సింగ్‌తో ఈ అమ్మడు అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇషాన్ ఖట్టర్ కూడా ఈ సారి కేన్స్‌లో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. సాంప్రదాయ భారతీయ అంశాలను కలిపి అతను తన తొలి ప్రదర్శన ఇవ్వబోతున్నాడు.
ఇక సీనియర్ అయిన నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెండు దశాబ్దాలకు పైగా కేన్స్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ వేదికపై స్టైల్ ఐకాన్‌గా ఆమె ఖ్యాతిని బలోపేతం చేయబోతోంది. 2024లో కేన్స్‌లో ప్రశంసలు పొందిన నిర్మాత పాయల్ కపాడియా ఈ సంవత్సరం అధికారిక జ్యూరీ సభ్యురాలిగా ఉన్నారు. సిమి గరేవాల్ తన నటనతో బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2025లో కేన్స్ ఫెస్టివల్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆమె నటి, దర్శకురలు ,నిర్మాత. దో బదన్, రాజ్ కపూర్‌తో మేరా నామ్ జోకర్, అరణ్యర్ దిన్ రాత్రి, పదాతిక్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. తనకెంతో ఇష్టమైన తెల్లని దుస్తులలో మెరిసేందుకు సిద్ధమవుతుంది.