ఫస్ట్ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎక్కువగా వార్తల్లో నిలిచిన సెలబ్రిటీ కపుల్ ఎవరైనా ఉన్నారా.? అంటే ఠక్కున గుర్తొస్తారు కాజల్-గౌతమ్ (Kajal Gautam) . గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట సోషల్ మీడియా ద్వారా తమ ఫాలోవర్లకు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటారు. వెకేషన్ టూర్ అయినా..ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినా వాటికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు.
కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) షూటింగ్ నుంచి బ్రేక్ దొరికినందంటే చాలు భర్త గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu)తో సరదా సమయాన్ని గడిపేందుకు రెడీగా ఉంటుంది. అందులోనా ఇవాళ ఆదివారం కావడంతో ఇద్దరికీ టైం దొరికినట్టుంది. ఈ సెలబ్రిటీ కపుల్ తాజాగా ముంబైలో వీధుల్లో సందడి చేశారు. మరి ఈ కలువ కళ్ల సుందరి ఎక్కడికెళ్లిందంటే కదా మీ డౌటు. ముంబైలోని బస్తియన్ వొర్లి రెస్టారెంట్ లో లంచ్ డేట్ కు వెళ్లిందీ జంట. వైట్ ఫ్రాక్ షార్ట్ డ్రెస్ లో ఉన్న కాజల్ సింపుల్ క్యాజువల్ లుక్ లో ఉన్న గౌతమ్ తో కలిసి కెమెరాకు ఫోజులిచ్చింది.
కాజల్ తన హబ్బీతో కలిసి లంఛ్ డేట్ కు వెళ్లిన వీడియో, ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తోంది. విడుదలకు ముస్తాబవుతుంది ఆచార్య. హిందీలో ఉమ ప్రాజెక్టు చేస్తోంది. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తుండగా..అవి షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?