Roja| సినీ సెలబ్రిటీలకి సంబంధించిన కొన్ని పాత ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. తమ అభిమాన స్టార్స్ చిన్నప్పుడు ఇలా ఉన్నారా అని ముచ్చటపడిపోతుంటారు. తాజాగా రోజాతో కొందరు పిల్లలు కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఓ చిన్నారిని రోజా పట్టుకొని ఉండగా, ఆమె చాలా క్యూట్‌గా ఉంది. ఈ చిన్నారి ఎవరా అని నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఆమె జూనియర్ సమంతగా అందరి దృష్టిని ఆకర్షించి ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ తెలుగు సినిమాలో అనుకోకుండా అవకాశం రావడం, ఆ సినిమాతో ఏకంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ రావడం జరిగింది.
ఇక బిగ్ బాస్ తర్వాత ఆమె పేరు మారుమ్రోగిపోయింది. నటిగా, యాంకర్ గా రాణిస్తూ టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసిన రచ్చ చూసి అందరు నోరెళ్లపెట్టారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అందరిని మంత్ర ముగ్ధులని చేస్తుంది. మరి ఇప్పటికైన ఆమె ఎవరో క్లారిటీ వచ్చిందా..యస్. తను మరెవరో కాదు అషూ రెడ్డి. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన అషూ రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి క్రేజ్ పెంచుకుంది.
ఇక సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ షోతో నానా రచ్చ చేసింది. అషూ రెడ్డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. డేంజరస్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆర్జీవీ అషు రెడ్డి కాళ్ళు పట్టుకోవడం, ఆమె పాదాలను ముద్దు పెట్టుకోవడం, ఆమె పాదాలను నాకడం వంటివి చేయడంతో అషూ రెడ్డిపై దారుణమైన ట్రోలింగ్ నడిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. ఆ ఇంటర్వ్యూ తర్వాత మా పేరెంట్స్ తో అందరూ నెగిటివ్ గా మాట్లాడారు. అపార్ట్మెంట్ లో చుట్టుపక్కల వారు కూడా మీ అమ్మాయి ఏంటి ఇలలా అన్నారట. నా పేరెంట్స్ ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు. జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఇదే అని , ఇంకోసారి అలా చేయకూడదు అని డిసైడ్ అయ్యానంటూ అషూ రెడ్డి పేర్కొంది.