Actress |ఇటీవల సెలబ్రిటీ జంటలు ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరపుకొని, పెళ్లి తేదీలు ఫిక్స్ చేసుకుని… చివరి నిమిషంలో పెళ్లిని రద్దు చేసుకోవడం తరచూ చూస్తూ ఉన్నాం. రీసెంట్గా క్రికెటర్ స్మృతి మంధాన–పలాశ్ ముచ్చల్ వివాహం రద్దు కావడం ఈ ట్రెండ్‌పై మరోసారి చర్చకు దారి తీసింది. నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్మృతి–పలాశ్ జంట పెళ్లికి సిద్దమవుతున్న సమయంలో వరుసగా జరిగిన అనుకోని ఘటనలు ఆ వివాహానికి అడ్డంకిగా మారాయి. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రికి హార్ట్అటాక్ రావడం, మరుసటి రోజే పలాశ్ ఆసుపత్రిపాలవ్వడంతో పెళ్లి నిలిచిపోయింది. చివరకు ఇద్దరూ స్వయంగా తమ వివాహాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
ఇప్పుడు నివేత పేతురాజ్ కూడా అదే బాటలో వెళుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘చిత్రలహరి’ వంటి సినిమాల ద్వారా సుపరిచితమైన నటి నివేత పేతురాజ్ తాజాగా తన వ్యక్తిగత జీవితంతో మరో హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది నెలల క్రితం నివేత తన కాబోయే భర్త రజ్ హిత్ ఇబ్రాన్ ఫోటోను షేర్ చేస్తూ ఎంగేజ్మెంట్ గురించి పబ్లిక్‌గా హింట్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. 2025లో తమ రిలేషన్ గురించి కూడా ఇద్దరూ బహిరంగంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు నివేత తనకు కాబోయే భర్తను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది
ఇద్దరూ కలిసి ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేసింది. రజ్ హిత్ కూడా నివేతను అన్‌ఫాలో చేసి ఫోటోలు తొలగించాడు. దీంతో వారి ఎంగేజ్మెంట్ రద్దయిందన్న రూమర్స్ ఊపందుకున్నాయి. సడెన్‌గా వారు తీసుకున్న ఈ నిర్ణయాలతో నెటిజన్లు వీరి మధ్య ఏదో జరిగిందని భావిస్తున్నారు. అయితే ఈ జంట ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. త్వరలోనే ఇద్దరూ క్లారిటీ ఇవ్వవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. 35 ఏళ్ల నివేత పేతురాజ్ గత రెండు సంవత్సరాలుగా కొత్త సినిమాలను ప్రకటించలేదు. ఆమె పెళ్లి పనులలో బిజీగా ఉన్న కారణంగా నటనకు విరామం తీసుకున్నారనే అభిప్రాయం వచ్చింది. అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ రద్దు రూమర్స్ రావడంతో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.