RC15 Movie Title | మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘RC15’. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చింది. దాంతో చరణ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాకు సీ.ఈ.ఓ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ రెండు పాత్రల్లో ఒక దాంట్లో సీ.ఈ.ఓ గా కనిపించనున్నాడట. దాంతో ఈసినిమాకు అదే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. గతంలోనూ ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటి అంజల్, రామ్ చరణ్ భార్యగా కనిపించనుంది.