రాజు వెడ్స్ రాంబాయి’ అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నదని, ఇంతటి విజయాన్ని ఊహించలేదనీ, రెండు తెలుగురాష్ర్టాల్లో కలిపి 9కోట్ల పైచిలుకు వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని, ఐ బొమ్మ క్లోజ్ అవ్వడం, టికెట్ రేట్ 99రూపాయలు పెట్టడం సినిమాకు కలిసొచ్చిందని, మొత్తంగా ఓ యాభై కోట్లు వసూలు చేసే అవకాశం కూడా ఉందనీ చిత్ర పంపిణీదారుల్లో ఒకరైన బన్నీవాస్ ఆనందం వెలిబుచ్చారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ప్రేమకావ్యం ‘రాజు వెడ్స్ రాంబాయి’. అఖిల్‌రాజ్, తేజస్విని జంటగా నటించారు. సాయిలు కంపాటి దర్శకుడు. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నదని చిత్ర పంపిణీదారులు బన్నీవాస్, వంశీ నందిపాటి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. ఈ సినిమా చూసిన అమ్మాయిలు ఎమోషన్‌కు గురవుతున్నారని, పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్ని ఈ మూవీ ఇస్తుందనే నమ్మకం ఉందని, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని వంశీ నందిపాటి అన్నారు.