పాపులర్ తమిళ కమెడీయన్ వివేక్ శనివారం తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం అభిమానులని, సినీ రంగ ప్రముఖులని ,సన్నిహితులని, శ్రేయోభిలాషులని శోకసంద్రంలోకి నెట్టింది. కామెడీతో కడుపుబ్బ నవ్వించిన వివేక్ ఇలా హఠాన్మరణం చెందడం అందరిని బాధించింది. ఆయన మృతిపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు రజనీకాంత్ , కమల్ హాసన్, విశాల్, సూర్య, విక్రమ్ వంటి స్టార్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా వివేక్‌కు సంతాపం తెలిపారు. వివేక్ మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది. నా అభిమాన కమెడీయన్స్‌లో ఆయన ఒకరు. వివేక్ కామెడీ ట్రాక్స్‌లో ఓ సామాజిక మెసేజ్ ఉంటుంది.తమిళ సినిమాకు అమూల్యమైన రత్నం. వివేక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Really saddened to hear about the demise of @Actor_Vivek garu . One of my fav artists in comedy . Entertained us for years with a underlying social msg in his comedy tracks . A priceless gem for Tamil cinema . Condolences to his family , near & dear . Rest in Peace Sir .
— Allu Arjun (@alluarjun) April 18, 2021