
మన టాలీవుడ్ హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు థియేటర్ బిజినెస్‌లు చేస్తున్నారు. ఏషియన్‌తో కలిసి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించగా, ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.ఇది హైదరాబాద్‌లోనే అత్యంత అత్యాధునిక మల్టీప్లెక్స్ కావడం విశేషం. మన రెండు తెలుగు రాష్టాల్లోనే దాన్ని మించిన మల్టీప్లెక్స్ మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. సీటింగ్ కెపాసిటీ, డిజైనింగ్, స్క్రిన్ ఇలా అన్నింటినిలోనూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో దీన్ని నిర్మించారు.
ఇటీవల విజయ్ దేవరకొండ కూడా ఇటీవల థియేటర్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి ఏవీడీ పేరుతో మహబూబ్ నగర్ లో మల్టీ ప్లెక్స్ ప్రారంభించారు. ఇక ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్ ఏఏఏ(AAA) సినిమాస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మల్టిప్లెక్స్ నిర్మాణంలో ఉంది. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. తాజాగా ఈ మల్టీప్లెక్స్‌కి సంబంధించి పూజా కార్యక్రమం జరగగా, దానికి బన్నీ హాజరయ్యాడు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో హైదరాబాద్ ప్రజలను అలరించేలా ఈ థియేటర్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
Icon Staar @alluarjun attends the pooja ceremony of his upcoming movie theatre AAA, along with Sunil Narang and Narayan Das. The posh movie hall is equipped with world class technology and will soon be ready to entertain the people of Hyderabad. pic.twitter.com/RFsapDZBbD
— BA Raju's Team (@baraju_SuperHit) November 6, 2021